రెడ్యా నాయక్ కు వార్ వన్ సైడ్ ! 

రెడ్యా నాయక్ కు వార్ వన్ సైడ్ !

రెడ్యా నాయక్ కు వార్ వన్ సైడ్ ! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : దరంసోత్ రెడ్యా నాయక్..రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. 1952 ఆగస్టు 20న మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో జన్మించారు రెడ్యానాయక్. ముఖ్యంగా ప్రముఖ ఎస్టీ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎస్టీల్లో ఈ స్థాయిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకులే లేరు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

*రాజకీయ జీవితం..
ఆర్ట్స్ లో పట్టభద్రుడైన రెడ్యానాయక్ రాజకీయంలోనూ అంతలా రాణించాడు. ఉగ్గంపల్లి సర్పంచ్ గా ఎన్నికైన రెడ్యానాయక్ అధ్యక్షుడు, పంచాయితీ సమితి, వ్యవసాయ మార్కెట్, డైరెక్టర్, మరిపెడ మండ ప్రజా పరిషత్ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీ ఎస్టీ చైర్మన్, మాజీ కాంగ్రెస్ మంత్రి, 2018లో ఎమ్మెల్యేగా 6వ సారి డోర్నకల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయవేత్త డీఎస్ రెడ్యానాయక్.

*ఎమ్మెల్యేగా పట్టు సడలని విజయం..
డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి 1989లో విజయం సాధించారు రెడ్యా నాయక్. ఆ తర్వాత 1994, 1999, 2004లో వరుస విజయాలు సాధించారు. వైఎస్ జమానాలో మంత్రిగానూ వ్యవహరించారు. 2009లో రెడ్యా నాయక్ కు అనూహ్య ఓటమి ఎదురైంది. ప్రజారాజ్యం ప్రభావంతో ఆయనకు ఓడిపోవాల్సి వచ్చింది. 2014 లో తిరిగి విజయం సాధించి, నియోజకవర్గంపై తన పట్టు ఏ మాత్రం సడలలేదని చాటుకున్నారాయన. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ కాంగ్రెస్ అభ్యర్థిగానే విజయఢంకా మోగించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రెడ్యా నాయక్ కేసీఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కవితతో పాటు టీఆర్ఎస్ లో చేరారు. ఇలా 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి విజయకేతనం ఎగరవేశారు. ఇప్పుడు మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు రెడ్యా నాయక్.

రెడ్యా నాయక్ కు వార్ వన్ సైడ్ ! 

*ఆయన మాటలు అందరికీ ఆదర్శం..
ఆరుసార్లు గెలిచినప్పటికీ ప్రజలతో ఆయన మాట్లాడే విధానం మాత్రం అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ప్రతి ఒక్కరినీ గుర్తుపట్టి, పనేంటో తెలుసుకుని పరిష్కరిస్తారాయన. అందుకే నియోజకవర్గంలో ఆయనకు అంతలా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా టీఆర్ఎస్ హయాంలో రెడ్యా నాయక్ కు మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఆయన ఇది కావాలంటే చాలు మంత్రులెవ్వరైనా వెంటనే స్పందిస్తారు. రెడ్యా నాయక్ సీనియార్టీకి అంత విలువ ఉంది. ఇక సీఎం కేసీఆర్ కుటుంబంతోనూ ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. రెడ్యా నాయక్ అంటే కేసీఆర్ కు ఎంతో గురి. ముఖ్యంగా కీలక విషయాల్లో రెడ్యా నాయక్ సలహాలను కూడా కేసీఆర్ తీసుకుంటారని టాక్. ఇక మంత్రి కేటీఆర్ కూడా రెడ్యా నాయక్ ను ఎంతో అభిమానిస్తారు.

*క్లీన్ ఇమేజ్ రెడ్యానాయక్ సొంతం..
రెడ్యా నాయక్ లో మరో ప్రాధాన్యత ఏంటంటే ఇప్పటివరకు ఆరుసార్లు గెలిచినా, నియోజకవర్గంలో మాత్రం ఆయనపై వ్యతిరేకత లేదనే చెప్పవచ్చు. వ్యక్తిగతంగా ఆయనకు ఉన్న క్లీన్ ఇమేజ్, దీనికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కరెంటు, సాగునీరు, వ్యవసాయానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత లాంటి అంశాలు రెడ్యా నాయక్ కు ప్లస్ గా మారాయి. ఈ తరుణంలో ఆయనకు మరోసారి బీఆర్ఎస్ టికెట్ రావడం, మళ్లీ విజయఢంకా మోగించడం ఖాయమేనంటున్నారు గులాబీ శ్రేణులు.

రెడ్యా నాయక్ కు వార్ వన్ సైడ్ ! 

*రెడ్యాకు గట్టి పోటీ ఎవరూ లేరు!
రెడ్యా నాయక్ కు సరైన ప్రత్యర్థి లేరన్న వాదన కూడా ఉంది. మధ్యలో సత్యవతి రాథోడ్ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమె కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్యా నాయక్ కు కాంగ్రెస్, బీజేపీ, ఇతర చిన్నాచితక పార్టీలు..ఇలా ఎందులోనూ సరైన పోటీ ఇవ్వగల నాయకులైతే లేరు. అద్భుతం జరిగితే తప్ప రెడ్యా నాయక్ ను ఓడించడం అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది.రెడ్యా నాయక్ కు వార్ వన్ సైడ్ ! *మంత్రి అయ్యే ఛాన్స్ ఉందా !
కాబట్టి ఈసారి ఆయనకు భారీ మెజార్టీ ఖాయమేనన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అన్నీ కలిసొస్తే ఈసారి రెడ్యా నాయక్ మంత్రి అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని టాక్. చూడాలి మరి..రెడ్యా నాయక్ భవితవ్యం ఎలా ఉండబోతుందో? భారీ మెజార్టీ వస్తుందా? ఈసారి అన్నీ అనుకూలించి మంత్రి అవుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.