ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల

ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదలవిజయవాడ: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్ (‌RGUKT-CET)ప్రవేశ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాప్ టెన్‌ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే నిలిచారు. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్‌ సిలబస్‌ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. నవంబర్ 28న జరిగిన ఈ పరీక్షకు 85,755 మంది విద్యార్ధులు హాజరయ్యారని తెలిపారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ ప్రాసెస్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్‌లైన్‌ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.