మెరిసే చర్మం కోసం కుంకుమపువ్వు..!

మెరిసే చర్మం కోసం కుంకుమపువ్వు..!

మెరిసే చర్మం కోసం కుంకుమపువ్వు..!

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్: కుంకుమపువ్వు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. కుంకుమ పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఆరోగ్యానికే కాదు, మీ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. అవును, దీనికి కారణం ఇందులోని కొన్ని ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు. నిజానికి కుంకుమపువ్వులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సున్నితమైన, మొటిమలు వచ్చే లేదా డల్ స్కిన్ పై ఇది అద్భుతాలు చేస్తుంది. ఇది డార్క్ స్పాట్‌లను తొలగించడంలో సహాయపడటమే కాకుండా స్కిన్ టోన్‌ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కుంకుమపువ్వు వల్ల ముఖానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

*మెరిసే చర్మం కోసం కుంకుమపువ్వు నీరు ఎలా తాగాలి ?
మెరిసే చర్మం కోసం కుంకుమపువ్వు నీటిని తయారుచేసేటప్పుడు మీరు మూడు వస్తువులను ఉపయోగించాలి. ముందుగా కలబంద, తేనె, కుంకుమపువ్వు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని నీటిలో కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ నీటిని ఉదయం ఒక చెంచాతో కలిపి ఉదయం పడగడపునే తాగాలి.

*చర్మానికి కుంకుమపువ్వు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

1. డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది :
కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ‘సి’ ఉంటాయి. అంతేకాదు క్రోసిన్, క్రోసెటిన్ వంటి శక్తివంతమైన కెరోటినాయిడ్లను కలిగి ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్, సన్ టాన్ డార్క్ స్పాట్స్, మొటిమల మచ్చలను తొలగిస్తుంది.

2. చర్మాన్ని తెల్లగా మారుస్తుంది :
కుంకుమపువ్వు చర్మాన్ని తెల్లగా మారుస్తుందా అంటే మారుస్తుందనే చెప్పొచ్చు. కుంకుమపువ్వు మీ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.చర్మంలోని మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా చర్మం తెల్లగా మారుతుంది.

3. ముఖానికి గ్లో వస్తుంది :
కుంకుమపువ్వు నీటిని తాగితే ముఖంలో మెరుపు పెరుగుతుంది. ఎందుకంటే మీ చర్మంలో హైడ్రేషన్ పెంచడంలో కుంకుమపువ్వు నీరు సహాయపడుతుంది. ఇది చర్మానికి తేమను జోడించడానికి పనిచేస్తుంది. తద్వారా ఫైన్ లైన్స్, ముడతల సమస్య ఉండదు.