రూ.2 కోట్ల 36 లక్షల విలువైన గంజాయి పట్టివేత

రూ.2 కోట్ల 36 లక్షల విలువైన గంజాయి పట్టివేతవరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల శివారులోని ఆర్టీసీ కాలనీ వద్ద డీసీఎం వాహనంలో తరలిస్తున్న రూ. 2 కోట్ల 36 లక్షల విలువైన గంజాయిని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీపీ డా.తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. లింగాల ఘనపురం ఎస్సై చాగర్ల రఘుపతి సిబ్బందితో కలిసి సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

డీసీఎంలో తరలిస్తున్న 1577 కిలోల 56 గంజాయి బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. 16 క్వింటాళ్ల గంజాయితో పాటు, డీసీఎం వాహనం, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ప్రభాకర్ తో పాటు మరో నిందితుడు మహేష్ ను టాస్క్ ఫోర్స్ మరియు లింగాల ఘన్ పూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేసి విచారించారు. దీంతో నిందితులు ప్రధాన నిందితుడు ఖాజా ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు.

పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, టాస్క్ ఫోర్స్ ఇంఛార్జ్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఘన్ పూర్ ఏసీపీ రఘుచందర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు , లింగాల ఘన్ పూర్ ఎస్సైతో పాటు, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సీపీ తరుణ్ జోషి అభినందించారు.