సునాముఖి సర్వరోగ నివారణి

సునాముఖి సర్వరోగ నివారణిఈ ఆకు చూర్ణాన్ని గానీ , కషాయాన్ని గానీ సేవిస్తే పైత్యం , వేడి చేసి, వాతాన్ని అణచి వేస్తుంది. గోరువెచ్చని నీళ్లల్లో ఒక సగం చెంచాడు సునాముఖి చూర్ణాన్ని కలిపి భోజనానికి పావుగంట ముందు సేవిస్తే మలబద్ధకాన్ని పోగొడుతుంది. సునాముఖి చూర్ణాన్ని తేనెతో కలిపి సేవిస్తే ధాతుపుష్టి కలుగుతుంది. పాతబెల్లంతో సునాముఖిని కలిపి సేవిస్తే జలుబు తగ్గిపోతుంది. నెయ్యితో కలిపి తీసుకుంటే శరీరంలోని రుగ్మతలన్నీ నశిస్తాయి. పెరుగుతో ఈ చూర్ణాన్ని కలిపి తీసుకుంటే విషాలు విరిగిపోతాయి.