‘వాలీబాల్ లీగ్’ను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్

'వాలీబాల్ లీగ్'ను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి క్రీడా మైదానంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్’ (Rupay Prime Volley ball League)ను ప్రారంభించారు. ఈ లీగ్ లో జట్లు దేశంలోని 7 నగరాల నుంచి 7 జట్లు పాల్గొంటున్నాయి. 7 టీమ్ లు హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, కొచ్చి, కాళికట్ మరియు బెంగుళూరు జట్లులు ఈ ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటున్నాయి. ఈ రోజు హైదరాబాద్ మరియు కొచ్చి నగరాల మధ్య ఈ మ్యాచ్ ను మంత్రి వీక్షించారు.'వాలీబాల్ లీగ్'ను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్ఈ కార్యక్రమంలో ఒలింపిక్ బ్యాడ్మింటన్ మెడలిస్టు మిస్ పీవీ సింధు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఐటీ, ఇండస్ట్రియల్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జాతీయ అర్చరీ సమాఖ్య అధ్యక్షుడు పాపారావు, ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీత శ్యామ్ సుందర్ రావు, రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్’ హైదరాబాద్ టీం యజమానులు అభిషేక్ రెడ్డి, దీపక్, శ్యామ్ సుందర్ రెడ్డి మరియు ఇతర జట్ల యజమానులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.