మళ్లీ తెరపైకి ఎస్వీబీసీ పోర్న్ కలకలం

మళ్లీ తెరపైకి ఎస్వీబీసీ పోర్న్ కలకలంతిరుపతి: తిరుమల శ్రీవారికి చెందిన ఎస్వీబీసీ ఛానల్​లో పోర్న్ వీడియో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మొన్న తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పాగా వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఏదో ఒక విధంగా అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో గతంలో ఎస్వీబీసీలో జరిగిన ఉదంతాలను మతపరంగా తెర మీదకు తెచ్చి తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనిని ముందుగానే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సంప్రదింపులు జరిపింది. యుద్ధ ప్రాతిపదికన ఎస్వీబీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి పైన సైబర్ సెక్యూరిటీ విభాగం ద్వారా సమగ్ర దర్యాప్తు చేయించింది. అపరాధులను గుర్తించి బాధ్యులపై తొలగింపు వేటు వేయాలని చైర్మన్, ఈవోలకు సూచించింది. అధికారపక్షం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సూచన మేరకు లోతుగా దర్యాప్తు చేయించి ఇప్పటికే ఐదుగురిని విధుల నుంచి తొలగించడంతో పాటు మిగతా ఐగుగురికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. దీంతో రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒక విధంగా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని చూసినా బీజేపీకి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అయింది. రాష్ట్ర అధికార పక్ష నాయకులు సరైన సమయంలో స్పందించి చైర్మన్​తో సంప్రదింపులు జరిపి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూశారు. దీంతో తప్పు చేసిన ఎవరిని కూడా ఉపేక్షించదు అన్న విషయాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీకి చెక్ పెట్టింది.