టీ20లో ఆసీస్​పై టీమ్ ఇండియా బోణీ

టీ20లో ఆసీస్​పై టీమ్ ఇండియా బోణీకాన్​బెరా : టీ20లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్​ ఘన విజయం సాధించింది. కోహ్లీసేన నిర్ధేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చేధించిన క్రమంలో ఆసీస్​ జట్టు 150/7 కే పరిమితమైంది. దీంతో భారత్​ 11 పరుగులతో బోణీ కొట్టి సిరీస్​లో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసిన విషయం తెలిసిందే.