తెలంగాణలో మరో చారిత్రక ఘట్టానికి నాంది

తెలంగాణలో మరో చారిత్రక ఘట్టానికి నాందివరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో మరో చారిత్రక ఘట్టానికి నాంది పలుకబోతున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖామంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు శంకుస్థాపన చేయబోయే సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద రాబోయే రోజుల్లో ఆందోల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతుందని హరీశ్ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు.