ప్రజావాణిలో సత్వరమే సమస్యలు పరిష్కారం

ప్రజావాణిలో సత్వరమే సమస్యలు పరిష్కారంవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: ఓ వైపు కరోనా ప్రభావం, మరోవైపు మేడారం జాతర కారణంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమం గత కొన్ని రోజులుగా నిర్వహించలేదు. అయితే చాలా రోజుల తర్వాత సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిచడంతో మంచి స్పందన వచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అర్జీలను , ధరఖాస్తులను స్వీకరించారు.

సాధ్యమైనంత వరకు ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సత్వరమే కలెక్టర్ పరిష్కరించారు. బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించబడటానికి ప్రజావాణి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణి, ఆర్డీఓ వాసు చంద్ర, డీఆర్డీఓ పీడీ ఏ శ్రీనివాస్ కుమార్, జిల్లా పరిధిలో ఉన్న అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.