శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాల్లర్ శేషాద్రి హఠాన్మరణం

 శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాల్లర్ శేషాద్రి హఠాన్మరణంతిరుమల : శ్రీవారి ఆలయ ఓయస్డి డాల్లర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. వైజాగ్ లో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన డాల్లర్ శేషాద్రి వేకూవజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుదిశ్వాస విడిచారు. డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని విశాఖ నుంచి తరలించారు.

సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఆయన భౌతికకాయాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీ అనాటమీ విభాగంలో ఎంబాంబ్ మెంట్ చేపట్టారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

రెండు గంటల పాటు జరిగిన ఈ ప్రక్రియ అనంతరం భౌతికకాయాన్ని విశాఖ నుంచి తిరుపతి తరలించారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని చూసి పలువురు చలించిపోయారు. తిరుమల వెంకన్న స్వామితో ఆయన సుదీర్ఘ అనుబంధం గుర్తు చేసుకున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి డాలర్ శేషాద్రి అకాల మరణంపై విచారణ వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

తిరుమలలో 1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ పూర్తి చేసిన డాల్లర్ శేషాద్రి 1978లో టీటీడీలో చేరారు. అప్పటి నుంచి శ్రీవారి సేవలో తరిస్తున్నారు. 2006 జూన్లో రిటైరైన శేషాద్రి సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్ డీగా టీటీడీలో కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి వారి సేవలో తరించారు.