భారత్ కు అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ 

భారత్ కు అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ భారత్ కు అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ 

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐసీసీ మొదటిసారి తలపెట్టిన ప్రతిష్టాత్మక అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో చాంపియన్స్ గా నిలిచారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇండియా అమ్మాయిలు, మొదటిసారి నిర్వహించిన అండర్-19 మహిళల టీ 20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్నారు. ఫేవరేట్ గా బరిలోకి దిగిన యంగ్ ఇండియా ఆదివారం జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లంపై గ్రాండ్ విక్టరీ సాధించింది. టోర్నీ చివరి వరకు రాణించిన యంగ్ ఇండియా, ఫైనల్లో ఇంగ్లండ్ పై జయకేతనం ఎగురవేసింది. అమ్మాయిల ఘనతను సామాన్యుడి నుంచి దేశ ప్రథమ పౌరుడి వరకు గర్వంగా ఫీలవుతూ కొనియాడారు. బీసీసీఐ అక్షరాల రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 రన్స్ కు ఆలౌటైంది. రియానా మెక్ డొనాల్డ్ (19) టాప్ స్కోరర్ కాగా, భారత బౌలర్లలో టిటాస్ సధు, పార్షవి చోప్రా, అర్చనా దేవి తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యంగ్ ఇండియా 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 రన్స్ చేసింది. తెలంగాణ యువ కెరటం గొంగడి త్రిష ( 24), సౌమ్య తివారి( 24), కెప్టెన్ షఫాలీ వర్మ ( 15) రాణించారు. టిటాస్ సధుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ గ్రేస్ స్క్రీవెన్స్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. మహిళల విభాగంలో ఇప్పటి వరకు భారత జట్టు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలువలేకపోయింది. అయితే ఇప్పుడు అండర్-19 అమ్మాయిలు మాత్రం ఆ లోటు తీర్చారు.