టోల్ గేట్ వద్ద హల్ చల్

టోల్ గేట్ వద్ద హల్ చల్గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ళ రేవతి హంగామా సృష్టించారు. మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. మంగళగిరి కాజా వద్ద టోల్ ఫీజ్ కట్టకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్ గేట్ సిబ్బంది బారిగేట్లను అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహించిన రేవతి కారు దిగి హల్ చల్ చేశారు. తన కారు ఆపుతారా అంటూ సిబ్బందిపై దాడి చేసి, బారికేట్లను తోసేశారు. రేవతి హడావుడితో టోల్ గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. రేవతి తీరును చూసి వాహనదారులు ఆశ్చర్యపోయారు. టోల్ గేట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.