మరోసారి ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ..!

మరోసారి ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ..!ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ కు గురవుతుండగా, తాజాగా భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైందంటూ పీఎంఓ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రధాని మోడీ అకౌంట్ ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో హ్యాక్ కు గురైంది. బిట్ కాయిన్లను లీగల్ చేశామంటూ హ్యాకర్స్ ట్వీట్ చేశారు. 500 బిట్ కాయిన్లను పౌరులకు పంచుతున్నామని ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోసారి ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ..!ఈ విషయాన్ని పీఎంఓ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ ద్వారా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలిపింది. ఈ విషయాన్ని వెంటనే ట్విట్టర్ కు తెలిపినట్లు పీఎం పేర్కొంది. ఈ విషయాన్ని ట్విట్టర్ కు పీఎంవో తెల్పడంతో ట్విట్టర్ ప్రధాని మోడీ అకౌంట్ కు భద్రత కల్పించింది. అయితే గతంలోనే ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. ఆ సమయంలో క్రిస్టో కరెన్సీ రూపంలో మోడీ సహాయనిధికి విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్లు కూడా చేశారు.