మేడారంలో దర్శనానికి కొత్త రూల్

మేడారంలో దర్శనానికి కొత్త రూల్ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శింకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో అధికారులు కొత్త నిబంధనను విధించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం లభిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్టు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అళ్లెం అప్పయ్య మాట్లాడుతూ..జిల్లాలో మేడారంతో పాటు పర్యాటక ప్రాంతాలైన రామప్ప, బొగత జలపాతం వద్ద ప్రతీ ఆది, బుధవారాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు