ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా 

ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా

వరంగల్ టైమ్స్, అమరావతి : మరో రెండేళ్లలో రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు ఏపీలో వైసీపీ సర్కారు ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా సచివాలయంలో ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. నేడు తొలి మంత్రివర్గంలో ఉన్న వారందరి చేత రాజీనామా చేయించారు. మొత్తం 24 మంది మంత్రులు తమ రాజీనామా పత్రాలను ఏపీ సీఎం జగన్ కు అందచేశారు. దాదాపు 2 గంటల పాటు కొనసాగిన కేబినెట్ సమావేశంలో ఏపీ మంత్రులంతా పాల్గొన్నారు. మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని సీఎం జగన్ ప్రకటించినందున ఈ గడువు గత డిసెంబర్ లో ముగిసింది. దీంతో మంత్రి వర్గంలో మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా మంత్రులు ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, కే నారాయణ స్వామి, అంజద్ బాషా, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, రంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్ రావు, కన్నబాబు, పిన్నపి విశ్వరూప్, గమ్మనూర్ జయరాం, గోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు అందచేశారు.