టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమెదం

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమెదం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన బుధవారం శాసనసభలో పూర్తి అయ్యింది. టీఆర్ఎస్ తరపున నామినేషన్లు వేసిన కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవిందర్ రావు, బండా ప్రకాష్, పాడి కౌశిక్ రెడ్డి, పి. వెంకట్రామరెడ్డిల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి వెల్లడించారు.

దీంతో వారి నామినేషన్లను ఆమోదించినట్లు పేర్కొన్నారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 వరకు గడువు ఉంది. అది ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు తమ నిర్ణయాన్ని ప్రకటించి, ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందచేస్తారని తెలిపారు.