అయోధ్య: ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో రామాలయ భూమి పూజలో భాగంగా జరిగిన శిలాపూజలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మొత్తం 17 మంది స్టేజ్‌పై పూజలో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా భూమిపూజలో పాల్గొన్నారు. మోదీ రాకకు పూర్వమే భూమిపూజ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పండితులు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేశుడు పూజ చేశారు. భూమి పూజ కోసం తొమ్మిది శిలలను వాడారు. జల, పుష్పాలతో మోదీ పూజించారు. మోదీ చేత సంకల్పం చదివించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పూజలో పాల్గొన్నారు. మోదీ పేరిట పండితులు పూజ నిర్వహించారు.