కళా తపస్వి మృతిపై టీడీపీ అధినేత దిగ్భ్రాంతి

కళా తపస్వి మృతిపై టీడీపీ అధినేత దిగ్భ్రాంతి

కళా తపస్వి మృతిపై టీడీపీ అధినేత దిగ్భ్రాంతి

వరంగల్ టైమ్స్, అమరావతి : ప్రముఖ దర్శకులు, కళా తపస్వి కె.విశ్వనాథ్ మరణ వార్తపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చంద్రబాబు నాయుడు అన్నారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.