సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన చీఫ్ విప్ దాస్యం

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన చీఫ్ విప్ దాస్యంహనుమకొండ జిల్లా : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియెజకర్గం 30వ డివిజన్ లోని జితేందర్ నగర్ నిరుపేద కుటుంబానికి చెందిన కోగిల కోర్నెల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో వున్న కోర్నెల్ పరిస్థితిని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పందించారు. హనుమకొండ నగరంలోని రియా ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి కోర్నెల్ కు మెరుగైన వైద్యం అందించారు. తర్వాత వారి ఆర్థిక పరిస్థితులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

తదనంతరం సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్షా యాబై వేలను లబ్ధిదారుడు కోర్నెల్ కు అందించారు. బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుడు కోర్నెల్ కు సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదలైన రూ. 1లక్షా 50వేల చెక్కును దాస్యం వినయ్ భాస్కర్ అందించారు. దీంతో సంతోషించిన బాధితుడు కోర్నెల్ చీఫ్ విప్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.