చల్లా దారి పడుతున్న కాంగ్రెస్ నాయకులు

చల్లా దారి పడుతున్న కాంగ్రెస్ నాయకులు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : రాష్ట్రంలో ఓ వైపు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నుంచి పలువురు టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గం దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన 30 మందికిపైగా కాంగ్రెస్ నాయకులు పులుకుర్తి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.చల్లా దారి పడుతున్న కాంగ్రెస్ నాయకులుహనుమకొండలోని ఆయన నివాసంలో 30 మందికిపైగా కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వారికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు.తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీలలో ఉండలేకనే ఇతరపార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పార్టీలో చేరినవారిలో దండు రవి, దండు చంద్రమౌళి, దండు ఆగయ్య, కొత్త రామచందర్, దండు రామచందర్, దండు సదానందం, మ్యాదరి రామచంద్రు, దండు రవీందర్, దండు బాబు, రమేష్, ప్రభాకర్, రవి, సారంగపాని, కొత్త నాగరాజు, లింగమూర్తి, ప్రశాంత్, అంకేశ్వరపు కృష్ణమూర్తి, దండు ఆగయ్య, లక్ష్మణ్, రాము, సూరయ్య, వినిత్, అంకేశ్వరపు మొగిలి, పసుల మహేందర్, దండు రమేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.