క్రేజీ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం

క్రేజీ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంబెంగుళూర్ : కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ఉదయం తన స్వగృహంలో జిమ్ చేస్తున్న సమయంలో గుండె పోటు రావడంతో పునీత్ రాజ్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో పునీత్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునే సమయానికి ఆయన పరిస్థితి చేయి దాటిపోయిందని వైద్యులు తెలిపారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మరణించినట్లు తెలిపారు. దీంతో సీఎం బొమ్మైతో పాటు ఇతర హీరోలు, ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుని పునీత్ రాజ్ కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

కన్నడ దిగ్గజ నటుడు రాజ్ కుమార్ మూడో కుమారుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ అత్యంత సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణానికి గురికావడం సినీ ప్రియులను తీవ్రంగా కలిచివేసింది. అయితే పునీత్ రాజ్ కుమార్ కు కన్నడలో క్రేజీ హీరో ఇమేజ్ ఉండటంతో ఆయన మరణవార్తను ప్రకటించడానికి ముందు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. బెంగుళూరులోని ప్రధాన కూడళ్లలో భద్రతను పెంచింది. పోలీసులకు సెలువులు రద్దు చేసింది. సినిమా థియేటర్లను మూసివేయాలని ఆదేశించింది.