పవన్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరిన డిప్యూటీ సీఎం

పవన్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరిన డిప్యూటీ సీఎం

పవన్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరిన డిప్యూటీ సీఎం

వరంగల్ టైమ్స్, ప.గో.జిల్లా : పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు చంద్రబాబునాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ లాగా ఉందని, ఒకదానితో ఒకటి పొంతన లేదని ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పెళ్లి బీజేపీతో, కాపురం టీడీపీతో చేసినట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభపై కొట్టు సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. ప్రజారాజ్యం మూసేసినపుడు, జనసేన పెట్టినప్పుడు మాట్లాడిన మాటలకు ఈరోజు మాట్లాడే మాటలకు అసలు సంబంధమే లేదని ఆరోపించారు.

స్వామి వివేకానంద సూచించిన 100మంది చాలు దేశాన్ని మారుస్తా అంటూనే, నీచంగా బూతులు బహిరంగ సభల్లో మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు. సజ్జల సలహా వింటే నాశనం అంటున్నావు .. మరి నాదెళ్ల సలహాలు తీసుకుంటూ నువ్వేం చేస్తున్నావ్ అని ఆయన ప్రశ్నించారు. యువతను రౌడీలుగా, గుండాలుగా తయారవ్వమని చెప్తున్నావ్ కానీ చదువుకోవాలని, మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మాత్రం చెప్తున్నావా అని ఘాటుగా ప్రశ్నించారు ?