ఊహాగానాలు నమ్మవద్దు

ఊహాగానాలు నమ్మవద్దు..మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్​రెడ్డి
నోముల మృతి రోజునుంచే రాజకీయాలు బాధాకారంఊహాగానాలు నమ్మవద్దుహైదరాబాద్‌ : పార్టీ మార్పుపై ఉహాగానాలు నమ్మవద్దని తనపై వస్తున్న తప్పుడు కథనాలను పట్టించుకోవద్దని మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఆయన త‌న‌యుడు రఘువీర్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రెస్​నోట్​ విడుదల చేశారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, ఆయన త‌న‌యుడు రఘువీర్‌ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలపై జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి స్పందించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగడం అనివార్యంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో దూకుడు మీద ఉన్న బీజేపీ నాగార్జునసాగర్ లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో అక్కడ బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి జానారెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకుని బలాన్ని పెంచుకోవాలని కమలం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు జానారెడ్డితో సంప్రదింపులు జరిపారని సైతం వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి స్పందించారు. తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. నోముల నర్సింహయ్య సంతాప దినాలు ముగిసేవరకు ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని ఆయన కోరారు. తన తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని రఘువీర్ అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించిన రోజు నుంచే ఉప ఎన్నికలు, గెలుపుపై వివిధ రాజకీయ పార్టీల నేతలు రకరకాలుగా విషప్రచారానికి తెర తీయడం బాధాకరమని చెప్పారు. నోముల సంతాప దినాలు ముగిసే వరకు రాజకీయాలు పక్కకు పెట్టాలని ఆయన కోరారు. విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేతగా తాను కోరేది ఇది ఒక్కటే అని ఆయన చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు తాను పార్టీ మారుతున్నానని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ విష ప్రచారం చేయిస్తున్నాయని మండిపడ్డారు. తనపై వస్తున్న తప్పుడు కథనాలను పట్టించుకోవద్దని రఘువీర్ రెడ్డి ప్రజలను కోరారు.