అపస్మారక స్థితిలో హీరో సాయిధరమ్ తేజ్

అపస్మారక స్థితిలో హీరో సాయిధరమ్ తేజ్

హైదరాబాద్ : హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం. స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ స్కిడ్ అయ్యి సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదం కేబుల్ బ్రిడ్జి-ఐకియా రూట్ లో సంభవించింది. తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతివేగంతో ఈ ప్రమాదానికి దారి తీసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు సమాచారం.