కేసీఆర్ దీక్షా దివస్ ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి

కేసీఆర్ దీక్షా దివస్ ముగింపు కార్యక్రమంలో హోం మంత్రిహైదారాబాద్ : కేసీఆర్ దీక్షా దివస్ ముగింపు రోజును పురస్కరించుకొని హైదారాబాద్ లోని హజ్రత్ యుసిఫైన్ దర్గాలో గురువారం రాష్త్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజల సంక్షేమం కోసం ప్రార్ధనలు నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 9న కేసీఆర్‌ తన 11 రోజుల నిరసన విరమించారు. దీక్ష ప్రారంభ తేది నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్షేమ, విద్యా, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక తదితర కార్యక్రమాల అనంతరం ముగింపు కార్యక్రమం జరిగింది.

కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మసీదుల పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారని హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ విమర్శించారు. మసీదు అంటే అల్హా ఇల్లు అని, రాజకీయాలు చేసే స్థలం కాదని హోం మంత్రి పేర్కొన్నారు. రెండు మసీదుల ప్రారంభోత్సవం తర్వాతనే సచివాలయాన్ని ప్రారంభిస్తానని కేసీఆర్ ముస్లింలకు హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఇప్పటికే మసీదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది అని, రెండు మసీదులను వాటి పురాతన మరియు అసలు స్థలంలో నిర్మిస్తున్నట్లు హోం మంత్రి తెలిపారు.

మసీదులపై కాంగ్రెస్ నేతలు నిరాధారమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు మండిపడ్డారు. ముఖ్యంగా ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నేతలకు హోంమంత్రి సూచించారు. సచివాలయంలోని రెండు మసీదులను యథాతథ స్థలంలోనే నిర్మిస్తున్నామని, సీఎం కల్వ కంట్ల చంద్రశేఖర్‌రావు హామీ మేరకు మసీదు, గుడి, చర్చి ప్రారంభించిన తర్వాతే సచివాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. కావున కాంగ్రెస్ నేతల అనవసర, నిరాధారమైన ప్రకటనలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు మసీదులు, దేవాలయాలపై రాజకీయం చేయకుండా ప్రజల బాగోగులు చూడాలన్నారు.