రాష్ట్రంలో రెండ్రోజులు వర్ష సూచన

రాష్ట్రంలో రెండ్రోజులు వర్ష సూచనహైదరాబాద్: రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఉందని, సముద్రమట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది.

తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వస్తున్న గాలులు వస్తున్నాయని చెప్పింది. దీని ప్రభావంతో రెండ్రోజులు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో శనివారం పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.