వామ్మో లారీ డ్రైవరూ ! వైరల్ వీడియో

వామ్మో లారీ డ్రైవరూ ! వైరల్ వీడియో

వరంగల్ టైమ్స్, కర్నూలు జిల్లా : టోల్ ఓవర్ ఆక్సిషిన్ ఫీజు అడిగినందుకు ఓ లారీ డ్రైవర్ రెచ్చిపోయాడు. డోన్ అమకతాడు వద్ద టోల్ సిబ్బంది దూకుడుతో ఆ లారీ డ్రైవర్ టోల్ సిబ్బందికి చుక్కలు చూపించాడు. ఫీజు కట్టనంటూ బండిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వామ్మో లారీ డ్రైవరూ ! వైరల్ వీడియోలారీ డ్రైవర్ ప్రయత్నాన్ని టోల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. లారీ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినా ఏమాత్రం భయపడకుండా లారీ డ్రైవర్ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. దీంతో ఆగ్రహించిన టోల్ సిబ్బంది లారీ డ్రైవర్ పని పట్టాలనుకున్నారు. ఇంకేముంది లారీ ముందుకు పరుగులు తీసిన టోల్ సిబ్బంది లారీ ఎక్కే ప్రయత్నం చేశారు. టోల్ సిబ్బంది శ్రీనివాసులు ఏకంగా లారీ బంపర్ పై నిలబడ్డాడు. అయినా ఏమాత్రం జంకని లారీ డ్రైవర్ బండిని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడు.

దీంతో మరింత ఆగ్రహానికి లోనై టోల్ సిబ్బంది మొత్తం లారీని వెంబడిస్తూ లారీ ఆపాలని డ్రైవర్ ని వేడుకున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం వినని లారీ డ్రైవర్ లారీని 10కి.మీ. మేర ముందుకు పోనిచ్చాడు. దాదాపు 10 కి.మీ. మేర లారీ బంపర్ పై టోల్ సిబ్బంది శ్రీనివాసులు కూడా ప్రయాణించాడు.

ఈ తతంగాన్ని మొత్తం చూస్తున్న మరికొంతమంది టోల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే లారీ ఉన్న ప్రాంతానికి తరలివచ్చిన పోలీసులు లారీని ఆపి, లారీ బంపర్ పై నిలబడ్డ టోల్ సిబ్బంది శ్రీనివాసులను కాపాడారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.