కేసీఆర్ ఇంట్లో ఘనంగా రాఖీ పండుగా

హైదరాబాద్‌: రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఆయన అక్కలు రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌కు సోమవారం వచ్చిన సీఎం అక్కలు లలితమ్మ, సకలమ్మ, లక్ష్మీబాయి, వినోదమ్మ ఆయనకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్‌ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.  ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, కేటీఆర్‌ సతీమణి శైలిమ తదితరులు ఉన్నారు.కేసీఆర్ ఇంట్లో ఘనంగా రాఖీ పండుగా

అనంతరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఆయన సోదరి, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. కేసీఆర్ ఇంట్లో ఘనంగా రాఖీ పండుగా

కేసీఆర్ ఇంట్లో ఘనంగా రాఖీ పండుగా

కేసీఆర్ ఇంట్లో ఘనంగా రాఖీ పండుగాఅనంతరం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు కవిత రాఖీ కట్టారు. అలాగే టీఆర్‌ఎస్‌ మహిళా టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రి సత్యవతి రాథోడ్, లోక్‌సభ సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యే సునీత, జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు.