11న వరంగల్ లో కిషన్ రెడ్డి పర్యటన

11న వరంగల్ లో కిషన్ రెడ్డి పర్యటనవరంగల్ అర్బన్ జిల్లా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 11న వరంగల్ లో పర్యటించనున్నట్లు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ ఉదయం రోడ్డు మార్గాన వరంగల్ చేరుకుంటారని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో భాగంగా మొదట భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో కేఎంసీలో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సందర్శించనున్నారు. అనంతరం హన్మకొండ న్యూ శాయంపేటలోని టీవీఆర్ గార్డెన్స్ లో జరుగనున్న బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రావు పద్మ తెలియచేశారు.