ఖరీదైన ఐపీఎల్ ప్లేయర్ గా కేఎల్ రాహుల్

ఖరీదైన ఐపీఎల్ ప్లేయర్ గా కేఎల్ రాహుల్స్పోర్ట్స్ డెస్క్ : అత్యధికంగా అమ్ముడుపోయిన ఐపీఎల్ క్రికెటర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ యేడాది జరుగబోయే ఐపీఎల్ సీజన్ కు 2 కొత్త జట్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్, లక్నో జట్లకు టీమ్ కెప్టెన్లను కూడా ఆయా ఫ్రాంచైజీలు కూడా సెలక్ట్ చేశాయి. లక్నో ఐపీఎల్ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఆర్పీఎస్జీ గ్రూపు ఆ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నది. అయితే రాహుల్ ను 17 కోట్లకు కొనుగోలు చేసింది ఆ టీం. దీంతో అత్యధికంగా అమ్ముడుపోయిన ఐపీఎల్ క్రికెటర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. లక్నో జట్టు ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ను 9.2 కోట్లకు సొంతం చేసుకుంది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను 4 కోట్లకు కొన్నది

ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ఐపీఎల్ మెగా వేలంపాట బెంగుళూరులో జరుగుతుంది. ఆ వేలంలో ఐపీఎల్ జట్ల మిగతా ప్లేయర్లను తీసుకుంటాయి. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక స్థాయిలో అమౌంట్ అందుకుంటున్నవారిలో కోహ్లీ, ధోనీ సరసన రాహుల్ చేరాడు. 2018లో ఆర్సీబీ కోహ్లీకి 17 కోట్లు ఇచ్చింది. కానీ ఈ సీజన్ కు అతనికి 15 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో 17 కోట్లు తీసుకున్న సీఎస్ కే కెప్టెన్ ధోనీ, ఈ సీజన్ కు 12 కోట్లకే ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.