‘భీమ్లానాయక్’ ప్రీ రిలీజ్ వేడుకకు కేటీఆర్

'భీమ్లానాయక్' ప్రీ రిలీజ్ వేడుకకు కేటీఆర్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 21న నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. శనివారం మంత్రి కేటీఆర్ ను ఆయన కార్యాలయంలో చిత్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కలిసి ఆహ్వానించారు. తాను ఈ వేడుకకు వస్తానని కేటీఆర్ మాటిచ్చారు. మంత్రి కేటీఆర్ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చేందుకు అంగీకరించినందుకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు తెలిపారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తుండగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. హైదరాబాద్ లోని యూసుఫ్ గూఢ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరుగనుంది.