మంత్రి గంగులకు హరీష్ రావు, కొప్పుల పరామర్శ

మంత్రి గంగులకు హరీష్ రావు, కొప్పుల పరామర్శ

మంత్రి గంగులకు హరీష్ రావు, కొప్పుల పరామర్శవరంగల్ టైమ్స్, కరీంనగర్ జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు ఆహార పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ను మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) బుధవారం మరణించిన విషయం తెలిసిందే. గురువారం రోజున మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలోని గంగుల కమలాకర్ నివాసానికి వెళ్లారు. మల్లయ్య పార్థీవ దేహంపై పూలమాల వేసి నివాళులార్పించారు. గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.మంత్రి గంగులకు హరీష్ రావు, కొప్పుల పరామర్శమంత్రుల వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌‌, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కరీంనగర్ తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపెల్లి మోహన్, బి.ఆర్‌.ఎస్.వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉన్నారు.