రాష్ట్రంలో 2 కోట్ల 99లక్షల 92 వేల 941 ఓటర్లు 

రాష్ట్రంలో 2 కోట్ల 99లక్షల 92 వేల 941 ఓటర్లు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కోటి 50 లక్షల 48 వేల 250 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇందులో కోటి 49 లక్షల 24వేల 718 మంది మహిళా ఓటర్లున్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 42,15,445, రంగారెడ్డి జిల్లాలో 31,08,068, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 25,24,951 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడైంది.

ఇక భద్రాచలం 1,42,813 మంది ఓటర్లతో అత్యల్ప ఓటర్లుగా ఉన్న నియోజకవర్గంగా భద్రాచలం నిలిచింది. ప్రతీ యేడాది ఓటర్ల జాబితా సవరణ తర్వాత జనవరి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గురువారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు.