అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు 

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ను హరీష్ రావు చదివి వినిపించారు. సభలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెల్పింది. గత యేడాది మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.