కలబందతో హెయిర్ ఫాల్‎కు చెక్..!!

కలబందతో హెయిర్ ఫాల్‎కు చెక్..!!

కలబందతో హెయిర్ ఫాల్‎కు చెక్..!!

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : కొంతమంది ఆస్తులు పోయినా బాధపడరు కానీ…జుట్టు ఊడిపోతే మాత్రం తెగ బాధపడుతుంటారు. అవును జుట్టు ముఖ అందాన్ని పెంచుతుంది. ఒత్తైన చుట్టూ మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే చాలా మంది జుట్టు సంరక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అయితే నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వల్ల చిన్న వయస్సుల్లోనే జుట్టు రాలిపోతుంది. మగవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కలబంద చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీ జుట్టు రాలకుండా నిరోధిస్తుంది. ఎలాగో చూద్దాం.

కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా కలబందలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది స్కాల్ప్ ను శుభ్రం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అదే సమయంలో ఇది జుట్టుకు తేమను జోడిస్తుంది. లోపలి నుండి తేమను అందిస్తుంది. మూలాల నుండి జుట్టును బలపరుస్తుంది. ఈ విధంగా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

1. అలోవెరాను కొబ్బరి పాలతో కలిపి అప్లై చేయండి :
అలోవెరాను కొబ్బరి పాలలో కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు కండిషన్ అవుతుంది. ఇది స్కాల్ప్ , జుట్టుకు పోషణ, జట్టు లోపల నుండి పోషణకు సహాయపడుతుంది. దీని కోసం, ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు మసాజ్ చేయండి. దాదాపు అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయండి.

2. ఉల్లిపాయ రసం కలబంద :
కలబందలో ఉల్లిపాయ రసాన్ని కలిపి రాసుకుంటే చాలా రకాలుగా మేలు జరుగుతుంది. ఈ మిశ్రమం జుట్టు రాలడాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. జుట్టు తిరిగి పెరగడానికి అనుమతిస్తుంది.సుమారు 3-4 పెద్ద ఉల్లిపాయలను తీసుకుని వాటిని బ్లెండర్‌లో మెత్తగా రుబ్బి రసం తీయండి. రసం తీయడానికి చీజ్‌క్లాత్ ఉపయోగించండి. దానికి అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, లైట్ మసాజ్ చేసుకుని సుమారు గంటసేపు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూ, కండీషనర్‌తో మీ జుట్టును శుభ్రం చేసుకోవాలి.

3. కలబంద, ఉసిరి :
కలబంద, ఉసిరి రెండూ కలిపి మీ జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడతాయి. దీనితో పాటు ఇది శిరోజాలను శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. ఉసిరికాయను తీసుకుని మెత్తగా చేసి రసం చేసుకోవాలి. ఇప్పుడు దానికి అలోవెరా జెల్ వేసి, రెండింటినీ మీ తలకు పట్టించాలి. కాసేపు అలాగే ఉంచి, మీ జుట్టును చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి.