‘భూదాన్ పోచంప‌ల్లి’ ఎంపికపై కేటీఆర్ హర్షం

‘భూదాన్ పోచంప‌ల్లి’ ఎంపికపై కేటీఆర్ హర్షం

హైదరాబాద్ : భూదాన్ పోచంప‌ల్లి’ గ్రామం ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపికకావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం చేశారు.

ఐక్య‌రాజ్య స‌మితికి అనుబంధంగా ఉన్న ప్ర‌పంచ ప‌ర్యాట‌క సంస్థ‌ మన ‘భూదాన్ పోచంప‌ల్లి’ గ్రామాన్ని ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక చేయడం తెలంగాణ‌కు దక్కిన మ‌రో అరుదైన మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన నేపద్యంలో పోచంపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో నిలిపామన్న కేటీఆర్, చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, నేతన్నలను ప్రోత్సహించే పలు కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. చేనేతకు పేరొందిన పోచంపల్లి గ్రామానికి దక్కిన ఈ అవార్డు వల్ల అక్కడ నేసే ఇక్క‌త్ చీర‌ల‌కు అంత‌ర్జాతీయంగా మరింత గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ లోని రామప్ప ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందడం, ఇప్పుడు పోచంపల్లి ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక కావడం తెలంగాణ పర్యాటక రంగానికి ఎంతగానో దోహదం చేస్తాయని కేటీఆర్ అభిలషించారు.