ఘాటు పుట్టిస్తున్న మిర్చి ధర

ఘాటు పుట్టిస్తున్న మిర్చి ధర

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ కొత్త మిర్చి హై రేట్ నమోదు చేసుకుందని మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. క్వింటాల్ కు రూ.80100 పలికిందన్నారు. మార్కెట్ చరిత్రలోనే ఇప్పటివరకు కొత్త మిర్చికి ఈ ధర పలకలేదన్నారు. రైతులు ఇప్పటివరకు కూడా మిర్చీని మార్కెట్ కు తక్కువ మోతాదులో తీసుకొని వస్తున్నారని అన్నారు.

ఆరబెట్టిన మిర్చిని మాత్రమే తీసుకొని రావాలని మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. ఖమ్మం జిల్లా రైతు నాలుగు బస్తాలు కొత్త దేశీ మిర్చి తీసుకొచ్చాడని దానికి 80,000 పై చిలుకు ధర పలికిందని తెలిపారు. తేమ శాతం తక్కువ ఉన్న మిర్చీని రైతులు తీసుకొని వచ్చి అధిక ధర పొందగలరని మార్కెట్ కార్యదర్శి కోరారు.