ఆస్కార్ కైవసం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సినీ ప్రేక్షకుల కలను సాకారం చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ ను సొంతం చేసుకుంది. అలాగే భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ను కూడా ఆస్కార్ వరించింది. రెండు సినిమాలకు అవార్డులు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.