రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్ ను ప్రభుత్వం నియమించింది. సీసీఎల్ ఏ కమిషనర్ గాను నవీన్ మిట్టల్ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జీవో 153 ను జారీ చేసింది. మంగళవారం వరకు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డులో ఆన్లైన్ వాల్యుయేషన్ వివాదం సంచలన వ్యాఖ్యలు చేశారు.

బోర్డు లెక్చరర్ల సంఘం నేత మధుసూదన్ రెడ్డికి నవీన్ మిట్టల్ మధ్య వివాదం చెలరేగింది. ఇంటర్ కమిషనరేట్ కు సమాంతరంగా మరో కమిషనర్ వ్యవస్థ నడుస్తోందని నవీన్ మిట్టల్ ఆరోపించారు. ఇంటర్ కమిషనరేట్ లో సీసీ కెమెరాల టాంపరింగ్ జరిగిందన్నారు. దీంతో మధుసూదన్ రెడ్డిపై సోమవారం తెల్లవారుజామున కేసు నమోదైంది. ఈ తరుణంలో రెవెన్యూ శాఖకు నవీన్ మిట్టల్ ను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.