ఉత్సాహం, ఉద్రిక్తతల నడుమ రేవంత్ పాదయాత్ర 

ఉత్సాహం, ఉద్రిక్తతల నడుమ రేవంత్ పాదయాత్ర

ఉత్సాహం, ఉద్రిక్తతల నడుమ రేవంత్ పాదయాత్ర వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హనుమకొండలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. అనేక ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఉత్కంఠంగానే కొనసాగింది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి మొదలైన పాదయాత్ర నక్కలగుట్ట, బాలసముద్రం, హనుమకొండ బస్టాండ్, పబ్లిక్ గార్డెన్ మీదుగా హనుమకొండ చౌరస్తా వరకు సాగింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది.

రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు తోట పవన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పాదయాత్రలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు స్థానికంగా సంచలనంగా మారాయి. వరంగల్ పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలను దుయ్యబడుతూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు తీవ్ర రాజకీయంగా కాకరేపింది.