శివనామ స్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం

శివనామ స్మరణతో మార్మోగుతున్న శ్రీశైలంశివనామ స్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం

వరంగల్ టైమ్స్, నంద్యాల జిల్లా : శ్రీశైలం ఆలయానికి భక్త జనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. 13 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మార్మోగిపోతోంది. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలచరిస్తున్నారు. నేడు శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ అందించనున్నారు. నంది వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అర్ధరాత్రి పాగాలంకరణ, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. నేడు శ్రీశైలానికి 2లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాపట్ల ఎస్ ఎన్ పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినమున పురస్కరించుకుని తెల్లవారుజామునే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనంనకు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శివ నామస్మరణతో చేసుకుంటూ, స్వామి వారి దర్శనమును పొందినారు.