ప్రజలకు కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివనామం జపిస్తే చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కల్గిస్తాయని సీఎం అన్నారు.
ప్రజలు భక్తి శ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు.