సింగరేణిలో సమ్మె సైరన్

సింగరేణిలో సమ్మె సైరన్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: కేంద్రప్రభుత్వంపై సింగరేణి కార్మికులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమరానికి సిద్ధం అవుతున్నాయి. ప్రాంతీయ లేబర్ కమిషనర్ తో నేడు సింగరేణి కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సింగరేణి కార్మిక సంఘాలు టీబీజీకేఎస్, ఐఎన్ టీయూసీ, బీఎంఎస్ సంఘాల ప్రతినిధులు లేబర్ కమిషనర్ కు సమ్మె నోటీసులను అందచేశారు. దీంతో సింగరేణి కార్మికులు సమ్మెకు దిగడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా సింగరేణిలో ఉన్న 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి కార్మిక సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఇప్పటికే పలు సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు చేశారు. కార్మిక సంఘాల నేతలు కూడా సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేస్తే, సమ్మె తప్పదని హెచ్చరించారు. అలాగే నేడు బొగ్గు బ్లాకుల వేలం గురించి ప్రాంతీయ లేబర్ కమిషనర్ తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మె నోటీసు అందచేశారు.