వ్యభిచార ముఠా అరెస్ట్..
వరంగల్ టైమ్స్ , మహబూబాబాద్ జిల్లా : టాస్క్ ఫోర్సు పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్లపై దాడులు చేశారు. మహబూబాబాద్ సిటీలో కొంతమంది ముఠాగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తునట్టు వారికి సమాచారం అందించి టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్, మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్, వారి సిబ్బందితో మహబూబాబాద్ లోని రెడ్డి బజార్ లో ఒక ఇంటిపై దాడి చేశారు.ఆ ఇంట్లో సర్వోదయ సంస్థలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు ఇతర ప్రాంతాలకు చెందిన వారు వ్యభిచారం చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. చాలా కాలంగా మహబూబాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వారు వెల్లడించారు. ఈ కేసులో అయిదుగురిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.