నూతన సిసి రోడ్డు పనులను ప్రారంభించిన చీఫ్ విప్

నూతన సిసి రోడ్డు పనులను ప్రారంభించిన చీఫ్ విప్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 31వ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు ఆధ్వర్యంలో గాయత్రి నగర్ కాలనీలో 31 లక్షలతో సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అభివృద్ధిలో భాగంగా సీడీఎఫ్ నిధులతో డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. డివజన్ల అభివృద్ధితోనే నగరాభివృద్ధి జరుగుతుందని చీఫ్ విప్ అన్నారు.నూతన సిసి రోడ్డు పనులను ప్రారంభించిన చీఫ్ విప్తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగంగానే డివిజన్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, కూడా అడ్వైజర్ మెంబర్ మాడిశెట్టి శంకర్ , 49వ డివిజన్ కార్పొరేటర్ ఎనుముల రాంప్రసాద్ మానస, డివిజన్ అధ్యక్షులు వెంకన్న, గన్నారపు ప్రసాదం, వేల్పుల భిక్షపతి , పెరుగు సురేష్, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.