ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానం ఖరారు

ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానం ఖరారు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఉద్యోగ నియామకాల భర్తీకి రోస్టర్ పాయింట్స్ తీసుకొనే విధానాన్ని రాష్ట్ర ప్ర భుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధ వారం ప్రభుత్వ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్త ర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 80 వేల పై చిలుకు పోస్టుల భర్తీ నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా రోస్టర్ పాయింట్స్ ఏవిధంగా తీసుకోవాలో స్పష్టంగా పేర్కొన్నారు.ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానం ఖరారుకొత్త రోస్టర్ ప్రకారం..
*1. 2018 ఆగస్టు 30 తర్వాత నోటిఫికెషన్ ఇచ్చే పోస్టులకు కొత్త రోస్టర్పాయింట్స్ 1 నుంచి పెట్టాలి.
*2. విభిన్న దిగువ తరగతి ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ భర్తీ చేసే ఖాళీలకు కూడా కొత్త రోస్టర్ విధానమే.

పాత రోస్టర్ ప్రకారం..
*1. 2018 ఆగస్టు 30కు ముందు నోటిఫికే షన్ ఇచ్చిన పోస్టుల్లో భర్తీ కాకుండా ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టు లను పాత రోస్టర్ ప్రకారమే భర్తీ చేయాలి.
*2. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో క్యారీఫార్వర్డ్ పోస్టులకు పాత రోస్టర్ విధా నమే వర్తిస్తుంది.