టెన్నిస్ ప్లేయర్ అర్జున్ జోడీకి టైటిల్

టెన్నిస్ ప్లేయర్ అర్జున్ జోడీకి టైటిల్వరంగల్ టైమ్స్ , స్పోర్ట్స్ డెస్క్: భారత యువ టెన్నిస్ ప్లేయర్ అర్జున్ బెంగళూరు ఓపెన్-2 ఏటీపీ చాలెంజర్ ట్రోఫీ టైటిల్ చేజిక్కించుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అర్జున్-అలెగ్జాండర్ ( ఆస్ట్రేలియా ) జంట 6-3, 6-7 (4/7), 10-7 తో భారత్ కే చెందిన సాకేత్ మైనేనీ-రామ్ కుమార్ రామ్ నాథన్ జోడీపై విజయం సాధించింది.