వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో బదిలీలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో బదిలీలు

వరంగల్ అర్బన్ జిల్లా: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పి.నాగబాబును వి.ఆర్ నుంచి అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ కు, కె. సుజాతను అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి వీఆర్ కు, ఉస్మాన్ షరీఫ్ వీఆర్ నుంచి వరంగల్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ కు, వరంగల్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి జి.సతీష్ కుమార్ ను వీఆర్ కు బదిలీలు చేస్తూ పోలీస్ కమిషన్ పి. ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ను సుబేదారి పోలీస్ స్టేషన్ సీఐగా , ఎస్.ఐ కె.జితేందర్ ను వి.ఆర్ నుండి హసన్ పర్తి పీఎస్ కు , ఎస్.ఐ ఎన్.రాజ్ కుమార్ ను హసన్ పర్తి నుండి ముల్కనూర్ ఎస్.ఐగా బదిలీ చేస్తూ పోలీస్ కమిషన్ పి. ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.