పట్టాలు తప్పిన విశాఖ – కిరాండోల్ రైలు

పట్టాలు తప్పిన విశాఖ – కిరాండోల్ రైలు

పట్టాలు తప్పిన విశాఖ - కిరాండోల్ రైలు

వరంగల్ టైమ్స్, విశాఖ జిల్లా : విశాఖపట్టణం జిల్లాలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఐతే డ్రైవర్ అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పింది. నేడు ఉదయం అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలోని శివలింగపురం వద్ద విశాఖ-కిరాండోల్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక బోగి పక్కకు ఒరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న రైల్వే సిబ్బంది, మరమ్మతులు చేపడుతున్నారు. మరోవైపు ప్రయాణికులను వేరే బోగిలో ఎక్కించి వారి గమ్య స్థానాలకు చేర్చారు రైల్వే అధికారులు.